పోరాట యోధుడు రిషభ్ పంత్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న పంత్ ఆరు మ్యాచు లుగా LSG ఓనర్ గోయెంకా సర్ కి రక్తకన్నీరు పెట్టిస్తుంటే...పూర్తిగా మునిగిపోయామా అని ఆయన బాధపడేలోపు పంత్ నిన్న చెన్నైపై చూడచక్కని ఇన్నింగ్స్ ఆడి కమ్ బ్యాక్ ఇచ్చాడు. పవర్ ప్లేలోనే ప్రమాదకరమైన LSG బ్యాటర్లు మార్ క్రమ్, నికోలస్ పూరన్ వికెట్లు కోల్పోతే...దేవుడిలా ఆదుకున్నాడు రిషభ్ పంత్. తొలుత అంతా నెమ్మదిగా వికెట్ కాపాడుకోవటానికే ప్రయత్నించినా..చివరికి వచ్చేసరికి బలంగా జూలు విదిల్చాడు. మొత్తంగా 49 బాల్స్ ఆడి 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63పరుగులు చేశాడు పంత్. ధోని లా హెలికాఫ్టర్ షాట్స్ కూడా ఆడాడు పంత్. కానీ లాస్ట్ 10 ఐపీఎల్ మ్యాచుల్లో పంత్ కి ఇదే మొదటి హాఫ్ సెంచరీ. అంతెందుకు ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ ను డకౌట్ అయ్యి మొదలుపెట్టిన రిషభ్ పంత్ ఇప్పటివరకూ ఆరు మ్యాచుల్లో చేసింది కేవలం 40 పరుగులు. నిన్న మ్యాచ్ లోనే తొలిసారిగా హాఫ్ సెంచరీ దాటిన పంత్..63పరుగులు చేసి తన కమ్ బ్యాక్ ను గ్రాండ్ గా ఎలివేట్ చేసుకున్నాడు. మ్యాచ్ చెన్నై చేతిలో ఓడిపోయినా పంత్ ఫామ్ లోకి రావటం మాత్రం LSG ఓనర్ సంజీవ్ గోయెంకా ను బాగా హ్యాపీ చేసినట్లు ఉంది. మ్యాచ్ తర్వాత అందుకే ఆయన నవ్వుతూ కనిపించారు. సో పోరాట యోధుడు ఫామ్ లోకి రావటంతో లక్నోకు రాబోయే మ్యాచుల్లో కచ్చితంగా కలిసి వచ్చే అంశమే.